మధిర కాకతీయ కమ్మసంగం ఆధ్వర్యంలో సన్మాన చేసిన రాయపట్నం ఉప సర్పంచ్ పుల్లారావు

Published: Tuesday November 30, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి నవంబర్ 29 కాకతీయ కమ్మసంగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమంలో తాము అందజేస్తున్నటువంటి కృషిని గుర్తించి ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా తాను సేవాలందించి అధికారులతో మాట్లాడడంలోను ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలోనూ తమను నమ్ముకున్న ప్రజల మరియు సమాజికవర్గ సమస్యలను పరిష్కరించడం లోను తమ ప్రత్యేక కృషిని అందజేస్తూసామాజికవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్న రాయపట్నం ఉపసర్పంచ్, రిటైర్డ్ టీచర్ మార్నిడి పుల్లారావుని కాకతీయ కమ్మసంగం నిర్వాహికులు సన్మానించడం జరిగింది తమ నిబద్ధతను, సేవలను గుర్తించి గౌరవపధంగా సన్మానించిన మధిర కాకతీయ కమ్మ సంగం నిర్వహకులందరికి ప్రతి ఒక్కరికి పేరుపేరున తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ. మీరిచ్చిన ఈ గౌరవానికి లోబడి ఎల్లవేళలా సమాజికవర్గ అభివుద్దిలోను తమను నమ్ముకున్న వారికి సహాయ సహకారాలు అందించడంలోనూ మనస్ఫూర్తిగా కృషిచేస్తానని మార్నిడి పుల్లారావుగారు పేర్కొనడం జరిగింది. ఒకప్పుడు వ్యవసాయరంగం ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి కమ్మవారు నేడు ప్రతి రంగంలో అమలాపురం నుండి అమెరికా వరకు సినిమా, ఆతిథ్యం, వైద్యం, విద్య, వ్యాపార, పత్రికలు, మీడియా వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగానూ, సంస్థల అధిపతులుగానూ స్థిరపడి తమ సత్తా చాటుతున్నారనితాను అభివుద్ది చెందుతూ తనతో ఉన్న నలుగురిని అభివృద్ధి చేసే గొప్ప మనసు కలిగినవారు కమ్మవారని తమని నమ్ముకున్న వారికి న్యాయం చేయగలిగినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేనదని కమ్మవారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ కుల మతాలకు భిన్నంగా ప్రతి ఒక్కరు అన్నా అని పిలుచుకునే విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు  ఈ సందర్భంగా స్మరిస్తూ. కమ్మ వారి కీర్తిని గొప్పతనాన్ని గూర్చి మార్నిడి పుల్లారావు కొనియడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రామనాథం మల్లాది వాసు చెరుకూరి నాగార్జున రావూరుు శ్రీనివాస్ కృష్ణ ప్రసాద్ గడ్డం రమేష్ మేడ వెంకటేశ్వర రావు మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాస రావుసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు