ఘనంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా పండుగ

Published: Tuesday September 21, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కల్పన గాయత్రి నాయకత్వంలో రాజన్న యాదిలో జెండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి పార్లమెంట్ వైయస్సార్ తెలంగాణ పార్టీ కన్వీనర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఉప్పల్లోని ఇందిరా గాంధీ బొమ్మ వద్ద మరియు హైకోర్టు కాలనీలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ కన్వీనర్ సురేష్ రెడ్డి,కార్యవర్గ సభ్యురాలు కల్పన గాయత్రి  వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమ పోరాటాలు ఎన్నో చేస్తుందని, మహిళలకు రావలసిన సంక్షేమ పథకాలు, 108, వృద్ధులకు పెన్షన్లు లాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు కుంటూ పడ్డాయని  తెలిపారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కల్పన గాయత్రి మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమ పాలన కోసం ఉద్యమించే పార్టీ వైయస్సార్ తెలంగాణ పార్టీ తెలిపారు.ప్రజా సంక్షేమం కోసం అధికార పక్షానికి ప్రతిపక్షంగా నిలిచే ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో  తెలంగాణలో తొలి మహిళా ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలమ్మ అని ప్రజలు నమ్ముతున్నారని వారు విశ్వసించారు. ఈ కార్యక్రమంలో పంగ యాదగిరి రెడ్డి, జయరాజ్, నవీన్ పాకాల దానియేలు, ప్రాన్సిస్, శ్రీనివాస్ ప్రకాష్, సంతోష్, ప్రవీణ్, ఝాన్సీ, శిల్ప, రాణి, తదితరులు పాల్గొన్నారు