ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులే లక్ష్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Thursday July 08, 2021
వికారాబాద్ జూలై 07 ప్రజాపాలన బ్యూరో : పట్టణ రూపురేఖలను మార్చి, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 3వ, 15వ వార్డుల కౌన్సిలర్లు మాసనగారి మంజుల ముత్యం రెడ్డి, చిట్యాల అనంతరెడ్డిల ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర పారిశుద్ధ్యం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు పట్టణ పరిశుభ్రత పాటించాలని సూచించారు. చెత్తరహిత మున్సిపల్ గా మార్చాలనే లక్ష్యం అందరి బాధ్యత అని హితవు పలికారు. ఏడవ విడత హరిత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేద్ధామని పిలుపునిచ్చారు.
మహారాణి ఫ్యాషన్స్ క్లాత్ షో రూం ప్రారంభం :
స్వయం ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. వికారాబాద్ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మహారాణి ప్యాషన్స్ క్లాత్ షో రూమ్ ను ప్రారంభించారు. షాపు వ్యవస్థాపకులు అన్నం రాజేష్ పసుపు నూరి సత్యం గుప్తా ఆధ్వర్యంలో మహారాణి ఫ్యాషన్స్ క్లాత్ షాప్ ను ప్రారంభింంచడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, నాగేష్ గుప్త నాయకులు పాతూర్ రామ్ రెడ్డి శివారెడ్డి పేట్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, కో ఆప్షన్ సభ్యుడు అఫ్జల్ పాష ఏఈ రాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.