కోవిడ్ -19 లో భాగంగా మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం

Published: Friday May 07, 2021
పరిగి, 6మే  ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలో కోవిడ్ -19 లో భాగంగా పరిగి  మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఈనెల 8 తేదీ శనివారం నుంచి 16వ తేదీ ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని దుకాణ సముదాయాలు తెరవబడతాయి. కావున ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు పరిగి లో లాక్ డౌన్ కొనసాగుతుందని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశంలో గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీల మద్దతుతో  మున్సిపల్ పాలక మండలి లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల సంక్షేమం ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించడమైనది. కావున ప్రజలందరూ అవసర నిమిత్తం నిత్యావసర సరుకులు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు అనగా అయిదు గంటల సమయ వ్యవధిలో అన్ని దుకాణ సముదాయలు తెరవబడుతాయి. కనుక ప్రజలందరూ భౌతిక దూరం పాటించి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుంచి బయటికి  రాకూడదని, తప్పనిసరిగా మాస్కులు ధరించి  భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు వివిధ రాజకీయ నాయకులు పోలీస్ సిబ్బంది  పాల్గొనడం జరిగింది.