ఆర్టీసీ కార్మికులను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానిదే -- కే రాజిరెడ్డి

Published: Monday September 26, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): డిపోలో ఆర్టీసీ కార్మికులను అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు కే రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గం ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు కే రాజి రెడ్డి చండూరు కు వెళుతున్న సందర్భంగా చౌటుప్పల్ లో ఆర్టీసీ కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కే రాజిరెడ్డి మాట్లాడుతూ మెహదీపట్నం డిపోలో అధికారుల ఒత్తిడికి మరణించిన డ్రైవర్ అశోక్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు వారి కుటుంబానికి తన ప్రగండ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి డిపోలో కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వమే కార్మికులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం వి చారి, నాయకులు ఎస్ ఎం రెడ్డి, శంకరయ్య, 
కే యాదయ్య, కత్తుల యాదయ్య, కే రామదాస్, రవీందర్ రెడ్డి, యాదయ్య, అంజయ్య, అధిక సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.