ఆళ్ళపాడు అంగనవాడి లో శ్రీమంత కార్యక్రమం

Published: Tuesday February 15, 2022
బోనకల్ ,ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం అళ్లపాడు ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు మధ్యాహ్న భోజనం అనంతరం అంగన్వాడీ  స్కూల్ లో అర్వపల్లి లక్ష్మి తిరుపతమ్మ శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ ఆళ్లపాడు అంగన్వాడీ కేంద్రం లో ప్రతి నేల శ్రీమంత కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా గర్భిణీ స్త్రీలను గుర్తించడం వలన ప్రతి నేల వారికి ఇచ్ఛే పోషక పదార్థాలు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోనుటకు  విలు ఉంటుందని  ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా గర్భిణీ స్త్రీలు ఆందరు తగిన జాగ్రత్తలు తిసుకో నుటకు ఉత్సాహంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూన్న అంగన్వాడీ టీచర్లలను సర్పంచ్ అభినందించినారు. అనంతరం పాఠ శాలలో మధ్యాహ్న భోజనం పరీశీలన చేసి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ భోజనం ఏలా ఉంటుంది అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు.  మేను ప్రకారం పిల్లలకు భోజనం పేట్టాలనీ మంచి రుచికరమైన ఆహారం వడ్డించాలని మధ్యాహ్న భోజన కార్మికులను కోరారు. మధ్యాహ్న భోజనం బిల్లు లు సకాలంలో చేల్లించడం లేదు అని వారు కొరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన మధ్యాహ్నం భోజనం బిల్లు లు వేంటనే విడుదల చేయాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు కొరారు బిల్లు లు సకాలంలో చేల్లిస్తే పిల్లలకు మంచి రుచికరమైన ఆహారం వడ్డించుటకు మధ్యాహ్నం భోజనం కార్మికులకు బిల్లు లు విడుదల చేసి వారికి నిరుత్సాహం లేకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చింతల రవి, అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్ బీ, గౌరమ్మ పంచాయతీ సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.