ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *గురు నానక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజి , హా

Published: Thursday December 29, 2022

ఇబ్రహీంపట్నం సమీపంలో గల గురు నానక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ , హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం లో  స్థానిక ప్రజలకు మరియు ఇతర గ్రామాలకు అందుబాటులో వుండే విధంగా బుధవారం నూతనంగా ఉచిత వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక  అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్  టిఎస్ ఉమామహేశ్వర్ రావు  , గౌరవ అతిథులుగా డాక్టర్  జి అనురాధ , డైరెక్టర్ అంకిత్ హాస్పిటల్, ఇబ్రహీంపట్నం, డాక్టర్   శ్రీనివాస్ , మెడికల్ సూపరింటెండెంట్, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి, డాక్టర్ దినేష్ , డైరెక్టర్ లిమ్స్ హాస్పిటల్ విచ్చేసి ఇబ్రహీంపట్నం లో స్థానిక ప్రజలకోసం ఏర్పాటు చేసిన నూతన హోమియో వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిధి ఏ సి పి శ్రీ ఉమామహేశ్వర రావు గారు మాట్లాడుతూ ముందుగా అయన గురు నానక్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, గురు నానక్ యాజమాన్యం ప్రారంభించిన ఈ హోమియోపతిక్ వైద్యశాల ద్వారా స్థానిక ప్రజలు వైద్య సదుపాయాలు ఉచితంగా పొందవచ్చని,డాక్టర్ సలహాలు మందులు కూడా పొందవచ్చని, ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా పొందాలని అయన ప్రజలను కోరడం జరిగింది. గౌరవ అతిధులు కూడా స్థానిక ప్రజలకోసం గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్యశాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన వైద్యసహాయాన్ని అందచేయాలని అందుకు కావలసిన సహకారాన్ని అందిస్తున్న యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలియ చేయడం జరిగింది.
కార్యక్రమంలో గురు నానక్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ షైనీ మాట్లాడుతూ కార్యక్రమానికి అతిధులుగా వేంచేసిన వారికి యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ వైద్యశాల ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్థానిక ప్రజలకు, వృద్దులకు పిల్లలకు మరియు స్త్రీలకు వారి వారి ఆరోగ్య దృష్ట్యా ప్రతిభ కలిగిన హోమియో డాక్టర్ల చేత ఉచిత వైద్య పరీక్షలు చేసి వారికి సిపారసు చేసిన మందులను ఈ వైద్యశాల ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుందని అందుకు ఎలాంటి రుసుము తీసుకోమని చెప్పడం జరిగింది, కాబట్టి ఈ వైద్యశాల సదుపాయాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అయన ప్రజలకు సూచించడం జరిగింది. అలాగే అయన స్థానిక యువత గురుంచి మాట్లాడుతూ తమ విద్యాసామర్థ్యాన్ని పెంచుకుని తద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచుకోవాలని తమ విద్యాసంస్థలలో కూడా అవకాశాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో హోమియోపతిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీమతి రేణుక , డాక్టర్ శివ , డాక్టర్ అర్పిత ముఖేర్జీ , డాక్టర్ సరితా  డాక్టర్ వీ రేఖ , డాక్టర్ దీప , డాక్టర్ హంసవీణ , డాక్టర్ వసంత , డాక్టర్ అజయ్ , డాక్టర్ అనీషా మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు .