పదిలో 100 శాతం ఉత్తీర్ణం సాధించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్

Published: Wednesday January 11, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 10, ప్రజాపాలన :
 
2022 – 23 విద్యా సంవత్సరానికి గాను త్వరలో జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు 100 శాతం ఉ త్తీర్ణత సాధించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో తన తండ్రి రాగ్యానాయక్ జ్ఞాపకార్థం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల అధికారులు, వార్డెన్లకు 10వ తరగతి విద్యార్థుల కొరకు తరగతి గదికి ఒకటి చొప్పున 42 అలారమ్ గడియారాలను అందించారు. సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు 16, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు 8, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహాలకు 15, అల్ప సంఖ్యాక సంక్షేమ వసతిగృహాలకు 3 అలారమ్ గడియారాలను అందించారు.
 
ఈ కార్యక్రమంలో వసతి గృహాల సంక్షేమ అధికారులు రవీందర్రెడ్డి, వినోద్కుమార్, నీరటి రాజేశ్వరి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.