హోమ్ కంపోస్టింగ్ డస్ట్ బిన్ లను పంపిణీ చేసిన కార్పోరేటర్ హరిశంకర్ రెడ్డి

Published: Monday May 16, 2022
మేడిపల్లి, మే15  (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 
25వ డివిజన్లో మహిళలకు హోమ్ కంపోస్టింగ్ డస్ట్ బిన్ లను స్థానిక  కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజల సహకారంతో డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, మహేందర్, మధు,నళిని,అనూష,కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.