పేదవాడి ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు జెడ్పిటిసి క

Published: Friday December 09, 2022
బూర్గంపాడు ( ప్రజాపాలన.)
పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం.వైద్యుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్.
వైద్యుల నియామకంతో పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు.ఆరోగ్య తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు. పడుతున్నాయని బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పేదవాడు ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం పయనిస్తుందని, అందులో భాగంగానే పేద, బడుగు బలహీన వర్గాల కోసం, వారి ఆరోగ్యాల సేవలు కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  1492 మంది డాక్టర్లు నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు . అందులో భాగంగా బూర్గంపాడు మండలానికి నలుగురు ప్రత్యేక డాక్టర్లు నియమించినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా పీహెచ్సీలో సేవలు మెరుగుపరుచుటకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకి ,ఆరోగ్య శాఖ మంత్రికి ,ముఖ్యమంత్రి కేసీఆర్ కి బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రత్యేక  ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల మరింతగా దృష్టి సాధించి ఆరోగ్య తెలంగాణ దిశిగా అడుగులు వేస్తుందని వారు ఈ సందర్భంగా తెలిపారు..