*మాల మాదిగల సమాధుల పక్కన మా సమాధులా?* - ఎస్సీల ఇళ్ళ మధ్యలో పాత స్మశాన వాటిక. -ఇళ్ల మధ్యలో నుంచి త

Published: Tuesday March 07, 2023

చేవెళ్ల మర్చి 6, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండలంలోని దామరగిద్ద గ్రామంలో గత నాలుగు రోజులుగా వైకుంఠ దామం పై గ్రామంలోని దళితులు మరియు బిసిలు   ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. పూర్వం స్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలంలోనే ఉప్పుడు కూడా అక్కడే సమాధి చేసుకుంటాం అంటున్నా బిసిలు. ఇక్కడ వద్దు ఇల్లుకు దెగ్గర ఉంది. ఇన్ని రోజులు అంటే వేరే వైకుంఠదామం లేకుండే అప్పుడు ఏమి అప్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా పల్లె ప్రగతి లో భాగంగా నూతనంగా స్వర్వే నెంబర్ 153లో రెండు ఎకరాలలో వైకుంఠ దామం ఏర్పాటు చేసి అని సౌకర్యాలు కల్పించింది.అందులోనే ఊరిలో ఉన్న అందరు కుల మతాలకు అతీతంగా సమాధి చేసుకుంద్దాం అని వివాదం జరుతున్న సందర్బంగా సోమవారం గ్రామానికి ఎంపిపి, జడ్పీటీసీ, బిఆర్ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి వివాద స్థలాని పరిశీలించి మాట్లాడుతున్న క్రమంలో ఇరు వర్గాల వారు ఎక్కరికొక్కరు కొట్టుకున్నారు. సమాచారం తెలుసున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. మాల మాదిగల సమాధుల పక్కన మేము సమాధులు చేయాలన్న అనే భావన బిసిలకు వచ్చింది అన్నారు.
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇరు వర్గాల వారు కొట్టుకునే స్థాయికి వివాదం చేరుకుంది. పిర్యాదు తీసుకున్న వెంటనే ప్రభుత్వ అధికారులు వచ్చి నిదరణ చేసుంటే ఈ గొడవ కాకుండే అనే గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చి సమస్యను పరిష్కరించాలని, గ్రామస్థులు కోరుకున్నారు.
గొడవ జరుగుతున్నప్పుడు ఎంపిపి విజయ లక్ష్మి రమణ రెడ్డి,జడ్పీటీసి మాలతి కృష్ణ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, బిఆర్ పార్టీ మండల్ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ అక్కడే ఉన్నారు.