భూ నిర్వాసితులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. . ప్రజా పా

Published: Tuesday October 04, 2022
మణుగూరు మండలం లోని సమితి సింగారం రెవెన్యూ పరిధిలోని రైల్వే లైన్ భూ నిర్వాసితులకు చెక్కులు అందజేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు .
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని తాసిల్దార్ కార్యాలయం నందు మణుగూరు మండలం సమితి సింగారం రెవెన్యూ పరిధిలోని భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గు రవాణా చేసేదెందుకు ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ నిర్మాణంలో నిర్వాసితులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  చేతుల మీదుగా ప్రభుత్వ నుంచి మంజూరైన కోటి రూపాయల విలువ గల చెక్కులను 33 మంది రైతులకు అందజేశారు, అదేవిధంగా 22 మంది రైతులకు స్వయం ఉపాధి కోసం అదనంగా సీఎం కేసీఆర్ గారితోని మాట్లాడి స్వయ ఉపాధి కోసం 22 లక్షలు రూపాయలు విలువగల చెక్కులను అందజేశారు, మొత్తం రైతులకు మొత్తం కోటి 22 లక్షల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
భద్రాద్రి, ధర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు రవాణా స్టేషన్ కు రవాణా చేసేదెందుకు ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ నిర్మాణంలో నిర్వాసితులైన వారికి భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులు అందజేశామన్నారు, అదేవిధంగా ఇల్లులు కోల్పోయిన వారికి స్థలాలు కేటాయిస్తామన్నారు., సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి అదనంగా నష్ట పరిహారం కింద చెక్కులు అందజేశామన్నారు, రానున్న రోజులలో అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు , మణుగూరు మండల తాసిల్దార్ శ్రీ నాగరాజు గారు, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మణుగూరు జెడ్పిటిసి పోషణ నరసరావు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.