నిధులు కేటాయించాలని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ధర్నా

Published: Wednesday November 24, 2021
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్నా డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశాలు పెట్టకుండా సమయాన్ని దాట వేస్తుండడంతో ఓపిక నశించిన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం నాడు కౌన్సిల్ సమావేశము పై ధ్యాస లేదు- ప్రజా సమస్యలపై వూసే లేదు, మేయర్ కో హటావో- జిహెచ్ఎంసి బచావో, ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి- డివిజన్లకు నిధులు కేటాయించాలని ప్ల కార్డులతో ధర్నాకు దిగారు. ఈ మేరకు రామంతాపూర్, హబ్సిగూడ కార్పొరేటర్లు బండారు శ్రీవాణి వెంకట్రావు, చేతన హరీష్ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న  కార్పొరేటర్లను అరెస్టు చేసి హైదరాబాదులోని పలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికలు జరిగి మేము కార్పొరేటర్గా గెలిసి సంవత్సరం కావస్తున్నా ప్రభుత్వము ఎలాంటి నిధులు ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంబడే కౌన్సిల్ సమావేశాలు ప్రారంభించి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట రావు, మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ ఓబీసీ మోర్చా కన్వీనర్ తాళ్ల బాలకృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, వులు గోండ నారాయణదాసు, వేముల వెంకట్ రెడ్డి, డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వేముల తిరుపతయ్య, పాల్గొన్నారు.