ఇండియా లిటరసి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ పై అవగహన

Published: Friday January 20, 2023
బోనకల్, ఫిబ్రవరి 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిది, పదోతరగతి విద్యార్థులుకు ఇండియా లిటరసి ప్రాజెక్ట్ ఆద్వర్యంలో కెరీర్ గైడ్ కోట కిషోర్ బాబు గురువారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగహన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పదవ తరగతి తరువాత వివిధ కోర్సులు వాటి వలన పొందే అవకాశాలు తెలుపుతూ హాలండ్ ఆక్టివిటీ ద్వారా విద్యార్థులు వారి ఆసక్తి, అభిరుచులు కు అనుగుణంగా ఎటువంటి కెరీర్ ను ఎంచుకోవలో పూర్తి అవగహన కల్పించడం జరిగింది.అలాగే ప్రాజెక్ట్ యొక్క చాట్ బాట్ హెల్ప్ లైన్ నెంబర్లు ద్వారా కోర్సులు,వివిధ సంస్థలు అందించే ఉపకార వేతనాలు, విద్యార్థులు యొక్క వ్యక్తిత్వం వంటి అంశాలు పై మరింత సమాచారని పొందవచ్చని తెలిపినరు. ఈ సందర్భంగా పాఠశాల ప్రదనోపాధ్యాయురాలు ఎన్ లక్ష్మీ రాజ్యం మాట్లాడుతూ విద్యార్థులు విద్య అవకాశాలు కోర్సులు పై సరి అయిన అవగాహన లేకపోవడం వలన ఇబ్బంది పడే విద్యార్థులకు ఈ కార్యక్రమం వలన విద్యార్థుల అనుమానాలు ను నివృత్తి చేస్తూ మంచి మార్గాన్ని ఎంచుకునేందుకు ఏంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.సరైన సమయంలో మంచి అవగహన క్రార్యక్రమని నిర్వహించినందుకు ఇండియా లిటరసి ప్రాజెక్ట్ కు పాఠశాల తరపున అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు శివ ,బాలస్వామి, రాజు,శ్యామ్, ప్రసాద్,లక్ష్మణ్ రావు,రాములు భవాని, విద్యార్థులు పాల్గొన్నారు.