*తాసిల్దార్ కార్యాలయం ల ముందు ధర్నా జయ ప్రదం చేయాలనీ ప్రజా సంఘాల పిలుపు* *వ్యవసాయ కార్మికులక

Published: Saturday July 30, 2022
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ
భూమి లేని వ్యవసాయ కార్మికులకు పేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలి. ప్రభుత్వ భూములను సాగు చేస్తున్నా రైతులకు  నూతన పట్టా పుస్తకాలు ఇవ్వాలి
నంది వనపర్తి సింగారం  కుర్మిద్ద తాటిపర్తి సర్వే నెంబర్  211.201.204 లో 380 ఎకరాలు సాగుచేసుకుంటున్న పేదలకు నూతన పాసు భుక్కులు ఇవ్వాలి.                                                      
ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలి.
  అర్హత  కలిగిన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇవ్వాలి.
  57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి, అర్హత కల్గిన వారందరికీ అన్ని రకాల పెన్షన్ ఇవ్వాలి.
దళిత బంధు  పార్టీలకతీతంగా  అర్హత కలిగిన వారందరికీ ఇవ్వాలి
కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి
ధరణిలో అన్నిరకాల భూ సమస్యలు పరిష్కారం చేయాలి
తమ్మలోని గూడెం గ్రామం నల్లవెల్లి శివారు సర్వే నంబర్  791 253 లో 90ఎకరాలు 16 సంవత్సరాలు  నుండి సాగుచేస్తున్నా రైతులకు పట్టాలు ఇవ్వాలి
రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు  జిల్లా అధ్యక్షులు డి జగదీష్
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు  పి అంజయ్య  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు  పి బ్రహ్మయ్య  రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కే తావునాయక్ ఎంపీ నరసింహ  వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పి జంగయ్య పి శివ కె జంగయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.