ఘనంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Published: Thursday July 07, 2022
జగిత్యాల, జులై 6 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు జడ్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవాలందిచాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జెడ్పీటీసీ మహేష్ , రూరల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, రైతు బంధు కన్వీనర్లు నక్క రవీందర్ రెడ్డి, జుంబర్తి శంకర్ అర్బన్ మరియు రూరల్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.