చిలుకూరులో కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ మధిర రూరల్ ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతి

Published: Thursday February 23, 2023
మధిర మండలం పరిధిలో చిలుకూరు గ్రామo లో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి ఆధ్వర్యంలో పాత స్కూల్ బిల్డింగ్ నందు గ్రామ పంచాయతి సహకారంతో ఏర్పాటు చేయగా ఈ క్యాంపు ను గ్రామ ప్రధమపౌరురాలు శ్రీ మతి నిడమానూరు సంధ్య వంశీ చేతుల మీదుగా తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాం నుండి కంటి వెలుగు డా. కె సునీత సoయుక్త ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు 18 సంవత్సరాలు పైబడినవారు తమ ఆధార్ కార్డు వెంట తెచ్చుకొని కంటి పరీక్షలు చేయించుకోని అవసరం ఐన వారికి వారి చూపును బట్టి కంటి అద్దాలు ఇస్తారు. మరి కొంతమందికీ ఆపరేషన్ కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ కు రిఫర్ చేస్తారు అని ఈ అవకాశం గ్రామ ప్రజల ఉపయోగించు కో లరు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది హెచ్ఇఒ సనప గోవింద్ హెచ్ఎస్ లంకా కొండయ్య ఎఎన్ఎమ్ నాగమణి ఎఎన్ఎమ్ ఆరుణ ఐకేపీ సీసీ కోటిరెడ్డి కంటి వెలుగు సిబ్బంది ప్రశాంత్ మల్లికార్జున్ ఆశ కార్యకర్తలు అంగన్వాడీ ఐకేపీ ఈజిఎస్ సిబ్బంది గ్రామ పంచాయతి మల్టీ పర్పస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.