గురుకులాల్లో నాణ్యమైన విద్య --ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Tuesday August 30, 2022

జగిత్యాల, ఆగస్టు 29 ( ప్రజాపాలన ప్రతినిధి): హాకీ క్రీడా కారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి  జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణ ఖిలా లో తెలంగాణ  మైనార్టీ రెసిడెన్షియల్  బాలుర పాటశాల అధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించినారు. అనంతరం మైనార్టీ రెసిడెన్షియల్  బాలుర పాటశాల లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మేల్యే పాటశాలలో భోజనం, ఇతర సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు బీసీ ఎస్సీ మైనార్టీ గిరిజన విద్యార్థులు  కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య బోధన భోజన వసతి కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నేడు జగిత్యాల ప్రముఖ కట్టడం కిలాలో క్రీడా పోటీలు ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతితో ఏలాంటి నష్టం వాటిల్లకుండా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేందర్, మైనార్టీ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్ కుస్రు హాజారీ, ఇతేమద్ధ్, కమాల్, జావేద్, పట్వారీ ముజాహిధ్, గౌస్, నాహిద్, మోహన్, గంగాధర్, పాటశాలపిఈటిలు, వార్డెన్లు, అధ్యాపకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.