మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు

Published: Wednesday March 31, 2021
వలిగొండ, మార్చి 30, ప్రజాపాలన ప్రతినిధి కరోనా నివారణకు ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించకపోతే చర్యలు తప్పవని స్థానిక ఎస్సై రాఘవేంద్రర్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలని, నివారణ చర్యలు మాస్కులు దరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ తప్పక ఉపయోగించాలని, కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులు గుంపులుగా గుమికూడరాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు ఆదేశాలు ఉల్లంఘించినట్లైతే విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షలు తప్పవని ఆయన అన్నారు.