వైద్యుల సేవలు వెలకట్టలేనివి : ఎమ్మెల్సీ

Published: Monday October 17, 2022
జగిత్యాల, అక్టోబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): సమాజానికి వైద్యుల చేస్తున్న సేవలు వెలకట్టలేనివని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిఅన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైద్య శిబిరంతో నిరుపేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని, వైద్య  శిబిరంలో పాల్గొన్న  వైద్యులను ఎమ్మెల్సీ అభినందించారు. వైద్యులకు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, నిరుపేద రోగులకు ఉచితంగా వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రెక్క ఆడితే గాని డొక్కాడని నిరుపేద రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనివ్వలన్నారు . నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవ అందించేందుకు కృషి చేయాలి అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని అన్నారు. నిరుపేద మహిళలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అందజేసి వారికి తోడుగా నిలవడం వారి సామాజిక సేవకు నిదర్శనం అన్నారు. కుట్టుమిషన్లతో స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధినిచ్చే స్థాయికి మహిళలు ఎదగాలని సూచించారు.
 
 
 
Attachments area