ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం

Published: Monday January 23, 2023

బోనకల్ , జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి:మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని శనివారం బాలికలకు వారి హక్కులు , చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ వీరభద్రమ్మ మాట్లాడుతూ ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు గల బాలికలకు బాల్యవివాహాలు ,సంపూర్ణ సమతుల్య ఆహారం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత , రక్తహీనత, చదువు ,మానవ అక్రమ రవాణా , మంచి అలవాట్లు అలవర్చుకోవడం వంటి అంశాల గురించి వివరించారు .అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లు 1098, 112, 181 గూర్చి బాలికలకు అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీస్‌ ప్రాజెక్టుల్లో ప్రతి నెల మూడో శనివారం స్వరక్ష డే ను నిర్వహిస్తున్నామని తెలిపారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బాధితులు 100, మహిళా హెల్ప్‌లైన్‌ 181, మహిళా కమిషన్‌ వాట్సప్‌ నంబర్‌ 94905 55533, 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కమలవాహిని, మిషన్ శక్తి కోఆర్డినేటర్లు పి ప్రమీల, ఎస్డి సమ్రిన్, ఏసిడిపిఓ వీరభద్రమ్మ, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు శిరీష , నాగమణి ,ఆశాలు , అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.