ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *ఇంజాపూర్ గ్రామకంఠ భూమిని కాపాడి పేదలకు ఇళ

Published: Tuesday February 21, 2023
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇంజాపూర్ గ్రామంలోనీ గ్రామకంఠం భూమిని  కబ్జాదారుల మంచి కాపాడి ప్రజాప్రయోజనాల నిమిత్తం ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీ ఎండి సాబీర్ అలీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య గార్లు మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి దానికి ప్రహరీ గోడ నిర్మించుకొని స్వాధీనపరుచుకుంటున్నారని ఇట్టి విషయాన్ని గ్రామంలోని ప్రజలు పలు దఫాలుగా అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోగా అట్టి భూమిని మరింత తమకబంధహస్తాల్లోకి తీసుకుంటున్నారని అన్నారు, గ్రామకంఠం భూమిని పట్టా భూమిగా మలుచుకొని అట్టి భూమిలో మట్టి పోసి చదును చేస్తున్నారని అన్నారు. ఇంజాపూర్ గ్రామకంఠ భూమిని రెవెన్యూ అధికారులతో వెంటనే సర్వే చేయించి మున్సిపాలిటీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని, లేని యెడల అట్టి భూమిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో  భూమిపై నిరుపేదలను సమీకరించి ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు పాతి  గుడిసెలు వేయిస్తామని  అధికారులను హెచ్చరించారు.అనంతరం కమిషనర్ శ్రీ సాబీర్ అలీ గారు మాట్లాడుతూ ఇంజాపురం గ్రామకంఠం భూమిని తప్పకుండా సర్వే చేయించి స్వాధీనపరుచుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ సిపిఎం కార్యదర్శి డి కిషన్ నాయకులు టీ. నరసింహ బి.శంకరయ్య, కె.వెంకట కృష్ణ, డి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.