పల్లే పల్లెకు కాంగ్రెస్,గడప గడపకు కాంగ్రెస్

Published: Wednesday April 19, 2023
 మధిర ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి:హాత్ సే హాత్ జోడో* కార్యక్రమం లో భాగంగా మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోచంపల్లి శంకర్రావు ఆధ్వర్యంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్* గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రాహుల్ గాంధీ సందేశ పత్రాన్ని పంచిపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు పరిచే కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఒకేసారి రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు, రైతుబంధు ఎకరాకు రూ.15 వేలకు పెంపు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ,భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి* *రూ.12వేలు, వైద్యం కోసం కుటుంబానికి సంవత్సరానికి ఉచితముగా 5 లక్షలు,ఆసరా పింఛన్లు ప్రతి* *అర్హులైనవారందరికీ పింఛన్లు
ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే 5000రూపాయలు,ప్రతి వికలాంగులకు 4000 రూపాయలు, ఉపాధి హామీ పథకంలో పని దినాలు కుటుంబానికి 300 రోజులు మరియు రోజు వేతనం 250 తగ్గకుండా ఇవ్వడం జరుగుతుంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు అమలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దార బాలరాజు సర్పంచులు పులిబండ్ల చిట్టిబాబు, మదార్ సాహెబ్* కాంగ్రెస్ నాయకులు *కర్నాటి రామారావు, చిలువేరు బుచ్చి రామయ్య, బిట్రా ఉద్దండయ్య, పగిడిపల్లి డేవిడ్, జమీల్ పాష, ఆదిమూలం శ్రీనివాసరావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు వేల్పుల చెంచయ్య, రాంప్రసాద్, సురేష్, పోచంపల్లి సురేష్, పత్తి పుల్లారావు* మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.