బ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి *నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవా

Published: Tuesday November 15, 2022

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో  ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానం (nep) పైన ఇబ్రహీంపట్నంలోని  ఆశ్రిత డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించడం జరిగింది .
ఈ సెమినార్ కు ముఖ్య అతిథులు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి  హాజరై  మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం విద్యారంగానికి అసమానతలు పెంచుతుందని అన్నారు. ఈ విద్యా విధానం అమలయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు  దూరం చేయడంలో ఒక భాగమే అని మండిపడ్డారు. విద్య వ్యవస్థని పూర్తిగా  కార్పొరేటులకు కట్టబెట్టే పేదవారికి విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని కోరారు.
ఎస్ఎఫ్ఐ 17వ ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో 13 నుంచి 16 వరకు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు, మేధావులు హాజరవుతున్నారని కోరారు. ఈ మహాసభలలో దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం కార్యచరణ రూపొందిస్తారని అన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  ఇబ్రహీంపట్నం డివిజన్  నాయకులు విప్లవ్ కుమార్,తరంగ్,స్టాలిన్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, సందీప్, లక్ష్మణ్,మధు, తదితరులు పాల్గొన్నారు.