వైఎస్ షర్మిల ను హౌజ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

Published: Saturday April 01, 2023
* వైఎస్ఆర్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్
వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజా పాలన : వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ను హౌజ్ అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిల బయటకు వెళ్ళాలి అంటే ఇతర కారణాలు చూపించి హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చారని స్పష్టం చేశారు.
 ఒక హోటల్ రూం లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల కు లుక్ అవుట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారని ధ్వజమెత్తారు. షర్మిల ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. షర్మిల కు లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి ఆమె ఏమైనా క్రిమినలా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా? వీళ్లు పోలీసులా? లేక రజాకార్లా? కొలువుల కోసం పస్తులుండి, అప్పులు చేసిన నిరుద్యోగుల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులా? టిఎస్ పిఎస్ సి కుంభకోణంలో పెద్ద దొంగలను పట్టుకోవాల్సింది పోయి, ప్రశ్నించే గొంతుకపై అణచివేతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.