కేజీబీవీ ఉపాద్యాల సమస్యలు పరిష్కరించాలి టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యాయులు షేక్ యాకుబ్ పాషా

Published: Friday November 25, 2022

బోనకల్, నవంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి: రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రతిష్టాత్మకంగా నడపబడుతున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారు బోధ నేతర పని భారంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పును వర్తింపజేయడం లేదని, వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గురువారం స్థానిక కేజీబీవీ బోనకల్ నందు జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయుల ఫెడరేషన్ టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యాయులు షేక్ యాకుబ్ పాషా పాల్గొని మాట్లాడుతూ కేజీబీవీ సమస్యలు పరిష్కారం కొరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 26న తలపెట్ట నున్న ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో మండల నాయకులు ఎస్ ఎస్ రామరాజు, బి ఎస్ సత్యజిత్, శ్రీహరి, శంకర్రావు, నాగరాజు పాల్గొన్నారు.