అంతరాష్ట్ర సరిహద్దులలో చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలి ** వీడియో కాన్ఫరెన్స్ లో డిజిపి అంజని కుమ

Published: Wednesday April 19, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 18 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి దాన్యం గురించి ప్రత్యేక నిఘా కోసం జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కొత్తగా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్ లతో కలిసి,ఎక్సైజ్ సూపర్డెంట్ జ్యోతి కిరణ్, అగ్రికల్చర్ రెవిన్యూ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లాఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి ధాన్యం గురించి ప్రత్యేక నిఘా కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, 1) వాంకిడి, సిర్పూర్ టి మండలంలో,2) వెంకట్రావుపేట్ ఎక్స్ రోడ్, 3) హుడిక్కి ఎక్స్ రోడ్ వద్ద మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం వైపుగా అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు.