ఉద్యోగాలు ఇవ్వకుంటే టి. ఆర్. యస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిరుద్యోగ యువత సిద్ధం కావాలి

Published: Tuesday February 01, 2022
వైరా(31): నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతిని ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలలో టి.ఆర్.యస్, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిరుద్యోగ యువత సిద్ధంగా కావాలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక వైరా మండల తహశీల్దార్ గారికి డి.వై.యఫ్.ఐ ఆధ్వర్యంలో వైరా తహశీల్దార్ అరుణ గారికి విన్నతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుంటే కేసీఆర్, టి.ఆర్.యస్ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కి మద్యం టెండర్లు, కాంట్రాక్టర్ల కమీషన్ల మీద ఉన్న దృష్టి ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద లేదని, నిరుద్యోగ భృతిని రూ, 3016 ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఉద్యోగాల కోసం ప్రభుత్వాలపై పోరాడి సాధించుకోవాలని తెలిపారు. వెంటనే టి.ఆర్.యస్ ప్రభుత్వం, కేసీఆర్ స్పందించి పి.ఆర్.సి ప్రకటించిన ఖాళీగా 1,96,136 ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని,ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలకు రూ, పది లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ఇవ్వాలని, స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, టి.ఆర్.యస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని గద్దె దించేందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ వైరా పట్టణ కార్యదర్శి షేక్.నాగుర్ పాషా, రూరల్ మండల అధ్యక్షుడు కృష్ణమాచారి లు పాల్గొన్నారు.