జిల్లా అదనపు కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ శర్మ

Published: Tuesday November 15, 2022

వికారాబాద్ జూరో 14 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్( లోకల్ బాడీస్ ) గా రాహుల్ శర్మ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ నిఖిలతో మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో అమలుపరుస్తున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి వీటి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు.