ఎస్పి కార్పోరేషన్ ఎదుట బిజేపి దళిత మోర్చా ధర్నా

Published: Thursday August 05, 2021
జగిత్యాల, అగష్టు 04 (ప్రజాపాలన ప్రతినిధి) : రాజ్యాంగ బద్దంగా దళితులకు చెందాల్సిన ఎస్సి రుణాలు, ఎస్సి సబ్ ప్లాన్ నిధులు దళితులకు  ఇవ్వాలని బిజేపి దళిత మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. భారతీయ జనతాపార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొత్త బాషా పిలుపు మేరకు బుధవారం ఎస్పి కార్పోరేషన్ ఎదుట బిజేపి దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్పి కార్పోరేషన్ రుణాలకై దరఖాస్తు చేసుకొంటే ప్రభుత్వం దళితులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని, దళితుల అభివృద్ధికి కేటాయించవలసిన ఎస్పి సబ్ ప్లాన్ నిధులు  దారిమళ్ళిస్తోందని అవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు అలగుర్తి లక్ష్మినారాయణ స్వామి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎస్పి కార్పోరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలని అర్హులైన దళితులకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అందోళనలను దశలవారీగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్, జిల్లా పట్టణ అధ్యక్షులు నక్క జీవన్, రూరల్ మండల అధ్యక్షులు తరాల మహేష్, ధర్మపురి మండల అధ్యక్షులు కడారి గంగాధర్, పెగడపల్లి మండల అధ్యక్షులు రాచర్ల అంజి, వెల్గటూర్ మండల అధ్యక్షులు మల్లేశం, మెట్ పల్లి మండల అధ్యక్షులు అభిలాష్, కోరుట్ల మండల అధ్యక్షులు వెంకటస్వామి, శ్రీనివాస్, రమేష్, గంగాధర్, రాజేష్, తిరుపతితోపాటు పలువురు వున్నారు.