ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి *కాంగ్రెస్ పార్టీ,మల్ రెడ్డి రంగారెడ్డి గూర్చి

Published: Friday February 03, 2023

ఇబ్రహీంపట్నం:నియోజకవర్గ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గడ్డ మల్లయ్య గూడలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురై  మృతిచెందితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి పరామర్శించి,బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని,న్యాయం జరగాలని అడగడంలో తప్పేంటని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతుందని పేద ప్రజలకు అన్యాయం చేస్తే సహించలేదన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డిపై అనుచుత వాక్యాలు చేసిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి  మరొకసారి నోరు జారితే సహించలేదన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసాడని,వయసులో కూడా పెద్దవాడైన ఆయనపై ఈ విధమైనదూషణలుచేయడంఅమానుషమన్నారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ  బంటి చేస్తున్న ప్రగతి నివేదన యాత్ర కాదని సొంత ఆవేద యాత్ర అని ఎద్దేవ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఫామ్ రాదనే ఉద్దేశంతోనే ఈ విధమైన పాదయాత్రలకు పునుకున్నాడని, ఇప్పటికే ఆయన అనేకచోట్ల భూకబ్జాలు,దళితుల భూములను లాక్కోవడం కోటానుకోట్ల సంపాదించడంజరిగిందనిన్నారు. ఎమ్మెల్యే ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకొని రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందేనని, మల్రెడ్డి రంగారెడ్డి నిప్పులాంటి నిజాయితీ గల మనిషియని,పేదల పాలిట ఆపద్బాంధవుడనిన్నారు. మరొకసారి మల్రెడ్డి రంగారెడ్డి పై,కాంగ్రెస్ పార్టీ పై,కార్యకర్తల పైన గాని అనుతమైన వాక్యాలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించలేరని అవసరమైతే యాత్రను అడ్డుకుంటం ఖబర్దార్ అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్,మున్సిపల్ ఉపాధ్యక్షులు పంది యాదగిరి,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి గౌస్ పాషా,మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు పబ్బే శ్రీను,సోప్పరి రవి కుమార్,ఇబ్రహీంపట్నం సోషల్ మీడియా ఇంచార్జి గోవర్ధన్ రెడ్డి,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి తేజ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంకాల కరుణాకర్,సీనియర్ నాయకులు చెనమోని యాదగిరి, కౌన్సిలర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.