ఎస్సిలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే దళిత బంధు : ఎమ్మెల్యే డా:సంజయ్

Published: Thursday October 14, 2021
జగిత్యాల, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఎస్సి వార్షిక ప్రణాళిక 2018-19 ఎంపిక కాబడిన లబ్ధిదారులకు సబ్సిడీ చెక్కులు, కుట్టు మిషన్లు, కంప్యూటర్లను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ అందజేసినారు. జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎస్సి కార్పొరేషన్ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఒక్కొక్కరికి 50వేల విలువగల ఎస్సి కార్పొరేషన్ యూనిట్లు పంపిణీ చేయటం గొప్ప కార్యక్రమమని, దళితులు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అత్యధిక నిధులు జగిత్యాలకు కేటాయిస్తున్నారని, దివ్యంగుల విషయంలో పెద్ద దిక్కులా ఉంటున్నారని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, గతంలో ఎస్సి సంక్షేమం కోసం 6000 కోట్లు ఖర్చు చేస్తే 2014 నుండి 23 వేల కోట్లు ప్రభుత్యం ఖర్చుచేసినదని అన్నారు. ఈ కార్యక్రమంలో రురల్ ఎంపీపీ లు రాజేంద్రప్రసాద్, సంధ్యారాణి, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, నాయకులు బాల ముకుందాం, దుమాల రాజ్ కుమార్, తలారి రాజేష్, గంగన్న, శ్రీపాల్, మహేష్, తిరుపతి, సురేందర్ రెడ్డి, గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎస్సి కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి నరేష్, తదితరులు పాల్గొన్నారు.