మున్సిపల్ డ్రైనేజీ దాటి బయటికి రావద్దు వ్యాపారులకు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ హెచ్చరిక

Published: Friday July 08, 2022
బెల్లంపల్లి జూలై 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని వ్యాపారులు, చిన్న, పెద్ద, దుకాణాల యజమానులు షాపు పరిధి దాటి రేకుల షెడ్డు గాని, ఇంకా ఏవైనా నిర్మాణాలు  దాటి బయట లేకుండా చూసుకోవాలని, ఏ ఇతర వస్తువులు కూడా డ్రైన్ బయట పెట్టకూడదని, ఏవైనా నిర్మాణాలు ఉంటే మూడు రోజుల్లో ఎవరికి వారు తొలగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జి, గంగాధర్ విడుదల గురువారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి చేసిన విజ్ఞప్తిని  పాటించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం బారి జరిమానాలను విధించడమే కాకుండా, షాపు లైసెన్స్ రద్దుచేసి, షాపులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. 
షాపు యజమానులు షాపులకు సంబంధించి కొనుగోలు చేసిన వస్తువులను, రాత్రి వేళల్లో అన్లోడింగ్ చేసుకోవాలని, పగటిపూట భారీ వాహనాలను రోడ్లపైకి తెచ్చి అన్లోడింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ఆయన హెచ్చరించారు.