ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ6 ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday February 07, 2023
*సబ్బండవర్గాల సంక్షేమ బడ్జెట్*
*జిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి


తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమానికి ఊతమిచ్చేదిలా ఉన్నదని జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు తెలంగాణ ప్రజలపై వివక్ష చూపుతున్నా రెండు లక్షల తొంబై వేల కోట్ల స్వశక్తి దాయక బడ్జెట్ ను ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రాజెక్టులకు 27 వేల కోట్లు, విద్యుత్ కు 12ల కోట్లు, వ్యవసాయానికి 26వేల831 కోట్లు, రుణమాఫీకి 6,385 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించడం ద్వారా కెసిఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మరోమారు పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేసారు. కేంద్ర పాలకులు సహకరించకున్నా రూణ మాఫీ, కళ్యాణలక్ష్మి, పింఛన్లు, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించడం ముదావహమన్నారు. పేద మద్యతరగత వర్గాలకు నియోజకవర్గానికి రెండువేల డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఒక్కొకదానికి మూడులక్షల చొప్పున నిధులు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి చేసిన హరీష్ రావు బడ్జెట్ ప్రతిపాదనలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.