బీరుపూర్ మండల్ కేంద్రంలో అభివృద్ధి పనులు లేక యువత గ్రామస్తులు ధర్నా రాస్తారోకో...

Published: Thursday September 30, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) బీరుపూర్ గ్రామంలోని ప్రధాన రోడ్డు సమస్యపై గ్రామంలోని యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో బీర్పూర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బుధవారం రోజున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత గ్రామస్థులు మాట్లాడుతూ నూతనంగా బీరుపూర్ మండల్ కేంద్రంగా ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికి  ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టలేదని ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే గ్రామ స్థాయి నాయకుల నుండి  మొదలుకొని ఎమ్మెల్యే ఎంపి మంత్రుల వరకు వినతిపత్రాలు ఇచ్చామని అయిన సమస్య పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్పుర్ మండల కేంద్రం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పోవడానికి ముఖ్య కారణం ప్రధాన రోడ్డు గుంతలతో ఇరుకుగా ఉండడమే అన్నారు. ఇప్పటికైనా ప్రధాన రహదారి విస్తరణ పనులు చేసి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని నిరసన తెలిపి ధర్నాకు దిగారు. రాజీనామాలు చేస్తేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బీర్పుర్ గ్రామ మండల స్థాయి నుండి ఎమ్మెల్యే ఎంపిలు రాజీనామాలు చేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని  గ్రామస్తులు యువత ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ గర్షకుర్తి రమేష్ యువ చైతన్య యూత్ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.