జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పరిష్కారానికై కృషిచేస్తా : ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంత

Published: Thursday December 22, 2022
టి డబ్ల్యూ జె ఎఫ  మహాసభల బ్రోచర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పెండింగులో ఉన్న జర్నలిస్టుల సమస్యల కృషికి ముందుంటా..
భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండల కేంద్రంలో ఈ నెల 28న జరుగనున్న పినపాక నియోజకవర్గ మహాసభల కరపత్రాలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పతకాలు ప్రవేశ పెట్టిందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు దూసుకు పోతుందన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను ప్రజలకు విస్తృత ప్రచారం చేసిది మీడియా మత్రమే అని, మీడియా సమాజ హితం కోసం నిరంతరం పాటు పడుతుందన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న సమస్యలను వెంటనే తీర్చేలా కృషచేస్తానన్నారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పినపాక నియోజకవర్గ మహాసభలు ఆశ్వాపురంలో జరుగనున్న సందర్భంగా సభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమలో టిడ్యబ్లుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ స్యులుడు వెలమ రాజేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ములకలపల్లి గోపీనాథ్, తునటి నర్సింహ రావు తదితరులు పాల్గొన్నారు.