పంటలను పరిశీలించిన అధికారులు, శాస్త్రవేత్తలు..

Published: Friday November 04, 2022
తల్లాడ, నవంబర్ 3 (ప్రజాపాలన న్యూస్):
మండల పరిధిలోని పినపాక గ్రామంలో వ్యవసాయ శాఖ  తల్లాడ, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా  ఆధ్వర్యంలో వరి, మిరప పంటలను గురువారం పరిశీలించారు. దీనిలో భాగంగా  వైరా శాస్త్రవేత్త డాక్టర్. వి చైతన్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులకు బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు నియంత్రణకు గాను ప్లాంటోమైసిన్ లేదా పోష మైసిన్ 0.2 గ్రాములు లేదా అగ్రి మైసిన్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. మిరప పంటలో వేరు కుళ్ళు, బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు గమనించడం జరిగిందని, వేరు కుళ్ళుతెగులు నివారణకు గాను కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బoడిజo 1 గ్రాము లీటరు నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదలు, చుట్టుపక్కన మొక్కల మొదలు తడిచేలా పోయాలని సూచించారు. అదేవిధంగా బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు నివారణకు గాను కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు + స్ట్రెప్టో సైక్లిన్ 1 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ జెస్సి సునీత, డాక్టర్ పి.ఎస్.ఎం సునీత, తల్లాడ మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్ ఉన్నారు.