రాజగోపాలస్వామి దేవాలయం భూముల వేలం. పోటీతత్వంతో గతేడాది కంటే పెరిగిన ఆదాయం.

Published: Friday July 15, 2022
పాలేరు జూలై 14 ప్రజాపాలన ప్రతినిధి
మండల కేంద్రంలోని శ్రీ రాజగోపాలస్వామి దేవాలయం కు చెందిన భూములకు గురువారం వేలం పాట నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 45 ఎకరాలకు 2022-23 నుంచి 2024-25 కాలపరిమితిలో సాగు కోసం నిర్వహించిన వేలం కు పోటీ బాగా పెరిగింది. గతేడాది మొత్తం రూ.5.23,500 వేలం కు రాగా, ఈ ఏడాది రూ.6, 91.000 వేలం లో రూపంలో వచ్చింది. ఈ ఏడాది రూ.1,68,000 అదనంగా ఆదాయం వచ్చింది. సర్వే నెంబర్ 535 నుంచి 574 వరకు 17.30 ఎకరాలను జీ.శ్రీనివాసరావు రూ.4.45 లక్షలకు దక్కించుకున్నారు. సర్వే నెంబర్ 110,112 లోని 3.20 ఎకరాలను దేశబోయిన లక్ష్మయ్య అనే రైతు రూ. 45,000 లకు దక్కించుకున్నారు. సర్వే నెంబర్ 162 నుంచి 186 వరకు 13.25 ఎకరాలు దాసరి రామారావు అనే రైతు రూ.1.86 లక్షలకు కైవసం చేసుకున్నారు. సర్వే నెంబర్ 165 లో 1.20 ఎకరం ను కందికొండ
సత్యనారాయణ అనే రైతు రూ. 15 వేల కు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్సెపెక్టర్ సమత, చైర్మన్ కురాకుల నాగేశ్వరారవు. ఈవో నారాయణచార్యులు, రైతు ప్రతినిధులు మన్నె కృష్ణారావు. కైలాసపు వెంకటేశ్వర్లు, వాకా శ్రీనాధ్. యలమంద, యడవల్లి ఉస్సేన్ గౌడ్, గడ్డం లక్ష్మయ్య, చిన్నంశెట్టి రాంబాబు, అర్చకులు ముడుంబ రామానుజచార్యులు తదితరులు పాల్గొన్నారు.