కొత్త పల్లి గ్రామంలో ఉపాధిహామీ పనివెంటనే ప్రారంబించాలిని నిరసన

Published: Thursday March 03, 2022
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ఇబ్రహీంపట్నం మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు కొత్త పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ పి.అంజయ్య మాట్లాడుతూ ఇగ్రామంలో సుమారుగా 700 మంది వరకు ఉపాధి పని చేస్తారు. కూలీలా తో ఇప్పటివరకు కనీసం దరఖాస్తు తీసుకోక పోవడం దుర్మార్గం 100 రోజులు ముగిసిన వారు కొంత మంది ఉన్నప్పటికీ పనిరోజులు ఉన్న వారికీ కూడా పని కల్పించక పోవడం ప్రభుత్వానికి కూలీల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది వెంటనే. కూలీలందరికి పని కల్పించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. సమ్మర్ అలవెన్స్ ను తీసి వేస్తూ తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి. ఎర్రటి ఎండలో 2.3 గంటల వరకు పనిచేయాలనే నిబంధన తీసివేయాలి. మాస్టర్లో జాబ్ కార్డు నంబర్ కాకుండ  తెలుగులో పేరుతో సహా ప్రింటూ చేయాలి. రోజు కూలీ 600 రూపాయలు ఇయ్యాలి. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. పేస్లిప్పులు ఇయ్యాలి. మెట్లను కొనసాగించి వారికీ పారితోషికం 6 రూపాయలు ఇయ్యాలి మెడికల్ కిట్లు అందు బాటులో ఉండాలి కూలీలందరికి పని ముట్లు ఇయ్యాలి. అన్నిగారామాలలో వెంటనే పని ప్రారంభించాలి తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి కావాలి జగన్ మాజీ పీల్డు అసిస్టెంట్ కే.జంగయ్య ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం. కూలీలా. నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది  అధ్యక్షులు కే.మల్లేష్ కార్యదర్శి పోలె శివ. సహకాలు. టీ.వెంకటయ్య, చిక్కుడు కృష్ణ. చిక్కుడు యాదయ్య.  ఉపాధ్యక్షులు శ్రీపతి యాదిరెడ్డి. కాలే రమేష్ కోశధికారి ఎం.యాదయ్య సభలు :- డి.వెంకటయ్య. బి.మల్లయ్య. డి.కృష్ణారెడ్డి. కే.నాగరాజు. కే.చంద్రయ్య. Ch.జంగయ్య కే.సామెలు. Ch.కృష్ణ. టీ.రంగయ్య. కే.కృష్ణ య్య డి.గోపాల్ రెడ్డి కే.జంగయ్య కే.మల్లయ్య ఈ కార్యక్రమంలో మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.