వార్డు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం

Published: Friday February 12, 2021
24వ వార్డు కౌన్సిలర్ తొడిగల శ్రీదేవి సదానంద్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11 ( ప్రజాపాలన ): వార్డు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని వార్డు కౌన్సిలర్ తొడిగల శ్రీదేవి సదానంద్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులోని వింటేజ్ సెంట్రల్ స్కూల్ లో వార్డు కౌన్సిలర్ తొడిగల శ్రీదేవి సదానంద్ రెడ్డి ఆధ్వర్యంలో "మా శారద ఆసుపత్రి" సౌజన్యంతో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అంబ ప్రసాద్ చవాన్, డాక్టర్ ప్రణతి, ఫార్మాసిస్ట్ అంజిరెడ్డి, క్యాంపు కో ఆర్డినేటర్ మణిదీప్ రెడ్డి, నర్సులు కవిత, సుజాతల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ..వార్డు ప్రజలు అందరూ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకొని, ఉచితంగా మందులు పొందాలని సూచించారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం సూచించిన సలహాలు, సూచనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. డాక్టర్ అంబ ప్రసాద్ చవాన్ మాట్లాడుతూ.. బిఎంఐ ( బాడీ మాస్ ఇండెక్స్ ), బిపి, షుగర్ల పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జనరల్ జైనెక్, కిడ్నీ సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్, ఈసిజి వంటి వ్యాధులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి, వింటేజ్ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ శేరి అనిత శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పట్లోళ్ళ సుచరితారెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు నరోత్తం రెడ్డి, ప్యాట శంకర్, వింటేజ్ స్కూల్ కరెస్పాండెంట్ శేరి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area