గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ బృందం

Published: Wednesday April 13, 2022
జన్నారం, రూరల్, ఏప్రిల్ 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ టు జే వన్ ప్రకారం తనిఖీలు కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా ఇంచార్జీ అమరగొండ తిరుపతి అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించామని తెలిపారు, ఈ సందర్భంగా సిసిఅర్ బృందం మాట్లాడుతూ జన్నారం మండలం 29 గ్రామపంచాయతి మిషన్ భగీరథ త్రాగు నీరు వస్తున్నప్పటికీ అవి మురికి నీరుగా వస్తున్నాయని వాటిలో భాగంగా కావ్వాల్ గ్రామ పరిధిలో మిషన్ భగీరథ నీరు అన్ని గ్రామాలకు వస్తున్నప్పటికీ కవ్వాల్ గ్రామానికి ఇప్పటి వరకు రానియెడల ఆ యొక్క గ్రామపంచాయతీ సంపదలో నుండి బోరింగు రిపేర్, కుళాయి పంపు ఇతరత్రా రూపాయాలలో అక్రమంగా దాదాపు 7.5  ఎడు లక్షల యాబై రూపాయల వరకు వృధా కర్చు చేసినట్లు కౌన్సిల్ పర్ సిటిజన్ రైట్స్ బృందం  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ త్రాగు నీరు వచ్చినట్లైతే ఈ యొక్క సొమ్ము గ్రామ అభవృద్దికి తోడ్పడి ఉండేదని సిసిఅర్ బృందం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పల్లె ప్రగతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పేరట లక్షల రూపాయలు వచ్చినప్పటికీ అవి ఏమి ఉపయోగంలో లేకపోవడం గమనార్హం, ఈ గ్రామపంచాయతీకి స్మశాన వాటిక నాడు ఏప్రిల్ 30 2021 ఓపినింగ్ అయినప్పటికీ ఇప్పటివరకు 21 మరణాలు జరిగిన పూర్తి సదుపాయం లేకపోవడం తో పగుళ్లు తేలి నిరుపయోగంగా ఉన్నదని సిసిఅర్ బృందం అన్నారు, పల్లె ప్రగతి వనం గ్రామ చెరువు శికం భూమీలో ఉండటంతో మొక్కల పెరుగుదల కాకుండా నీటిలో మునిగి చనిపోతున్నాయని సిసిఅర్ బృందం పేర్కొన్నారు, గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డు గుట్ట బోరు పైన ఉండటంతో నిరుపయోగంగా పడిఉన్నదని సిసిఅర్ బృందం తెలిపారు, ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కొరకు మంచి పథకాలను ప్రవేశపెడితే గ్రామ పాలకులు సరియైన విధంగా వినియెాగింతలో విపలం చేస్తున్నారని సిసిఅర్ బృందం వాపోయారు, ఈ బృందం సేకరించిన సమాచారాన్ని త్వరలోనే పై అధికారులకు పిర్యాదు ఇస్తామనిఇస్తామని అన్నారు, ఈ కార్యాక్రమంలో కవ్వాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎజస్, కవ్వాల్ సర్పంచ్ రాథోడ్ లక్ష్మికలిరం, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్లు జంగిల్ సాగర్, కే నరేష్, రాగుల రవి, స్వామి, పి శేకర్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.