జిల్లా ఏరియా ఆస్పత్రికి ఆక్సిజన్ స్ట్రేచర్స్ అందజేత

Published: Friday June 04, 2021
జగిత్యాల, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆక్షిజన్ స్ట్రేచర్స్ నిరుపేదలకు కంటి ఆపరేషన్లు చేతులు కోల్పోయిన వికలాంగులకు కృత్రిమ చేతులు కలిగిన వారికి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సివిల్ ఆస్పత్రి సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు మాస్కులు నిత్యవసర సరుకులు రోటరి క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. జగిత్యాల ఏరియా ప్రధాన ఆస్పత్రికి 5 ఆక్సిజన్ స్ట్రేచర్స్ మాస్కులు శానిటైజర్స్ ఆక్సిజన్ సిలెండర్ స్టాండ్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ సమక్షంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుదాక్షిణదేవి ఆర్ఎంవో రామకృష్ణలకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధనిక దేశాల్లో సైతం స్వచ్చంద సంస్దలు కీలకపాత్ర పోషిస్తాయని జగిత్యాల జిల్లాలో ఆపి రోటరి క్లబ్ సంయుక్తంగా ఇప్పటి వరకు 9వేల ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం జరిగిందని అన్నారు. దాతలు సైతం ముందుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తోచిన విధంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రోటరి క్లబ్ సేవలు మరువలేనివని ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు చేస్తున్న రోటరిక్లబ్ మున్ముందు మరిన్ని సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరి క్లబ్ అధ్యక్షుడు చారి అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ  జుంబర్తి రాజ్ కుమార్ బొడ్ల జగదీష్ భోగ ప్రవీణ్ కొల శ్రీనివాస్ కత్రోజ్ గిరి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.