ఆరోగ్య మేళాప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలిజిల్లా కలెక్టర్ విపి గౌతమ్

Published: Friday April 22, 2022
మధిర ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి ప్రభుత్వ వైద్యశాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కోరారు గురువారం మధిర ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య మేళా మెగా హెల్త్ క్యాంపును జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్న చిన్న జబ్బులు నుండి గుండెజబ్బులు వరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో డి హబ్ అందుబాటులో ఉన్నదన్నారు. డి హబ్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు అన్నారు. గుండెజబ్బులు ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని, గుండెజబ్బులు సోకిన వారికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో షుగరు బీపీకి సంబంధించిన మందులు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అత్యధికంగా జరిగే విధంగా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ప్రైవేటు  వైద్యులు కూడా సిజేరియన్ లను ప్రోత్సహించ వద్దని ఆయన సూసించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్య అందుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయినవారికి కెసిఆర్ కిట్టుతో పాటు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ సారధ్యంలో ప్రజలకు విద్య వైద్యం సక్రమంగా అందుతున్నాయని ఆయన తెలిపారు. ఆరోగ్య మేళాలో మొత్తం 1326 మంది వైద్య సేవలు పొందారు. ఆరోగ్య మేళాకు వచ్చిన రోగులకు సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు మెడికల్ షాపుల అసోసియేషన్ మధిర డివిజన్ అధ్యక్షుడు దొడ్డ మురళి ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరావు మాటూరు పేట వైద్యులు వెంకటేష్ సివిల్ ఆస్పత్రి వైద్యులు మనోరమ, అనిల్ కుమార్, శ్రీనివాస రావు పుష్పలత మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఎంపీపీ మెండెం లలిత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ అంబటి రమాదేవి సిడిపిఓ శారదా శాంతి పాల్గొన్నారు.