డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు లాభదాయకం...ఏడీఏ..

Published: Friday July 09, 2021
పాలేరు: జూలై 8 (ప్రజాపాలన ప్రతినిధి) : వ్యవసాయంలో డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు లాభదాయకమని కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ చంద్ర అన్నారు. కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామములో బజ్జురి వెంకట రెడ్డి అనే రైతు పొలములో డ్రమ్ సీడర్ లాగి వరిని నేరుగా విత్తుకునే పద్ధతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారం విత్తనాలు ఎకరాకు 12-15 కేజీలు సరిపోతుందన్నారు. విత్తనాలు పోలంలో వేసిన తర్వాత కలుపు నివారణకు వేసినా 24-48 గంటల వరకు సాతి (పైరజో సల్పారిన్ ఇథియిల్) అనే కలుపు మందును 80గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చెయ్యాలన్నారు. లేదో పెండిమిథాలిన్ 1.0 లీ/ ఎకరానికి పిచికారీ చేయాలని తెలిపారు. తద్వారా రైతులకు రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. డ్రమ్ సీడర్ పద్వతి ద్వారా సకాలంలో వరిని విత్తుకోవచ్చని, సాధారణ వరి పోలం కంటే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో నీరు కట్టే అవసరం తగ్గుతుందన్నారు. మొక్కల మధ్య దూరం ఉండడంతో గాలి, వెలుతురు సోకి చీడపీడలు ఉధృతి తగ్గుతుందన్నారు. అలాగే కూలీలా అవసరం తగీ ఎకరాకు 8వేల నుంచి పదివేల వరకు ఆదా అవుతుందన్నారు. అనంతరం కూసుమంచి లో ఏడీ ఏ స్వయంగా దమ్ము చేసి, రైతులకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ వాణి, ఏఈఓలు జానీ బాబా, సాయిరాం, రైతులు తదితరులు పాల్గొన్నారు.