ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. వైరా ఎంవీఐ శంకర్ నాయక్..

Published: Monday January 16, 2023
వైరా, జనవరి 14 (ప్రజాపాలన న్యూస్): ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పండగను ప్రజలందరూ కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఏడాది జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.