శ్రీ చైతన్య పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం అనుమతి రద్దు

Published: Tuesday March 07, 2023
* జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి
వికారాబాద్ బ్యూరో 06 మార్చి ప్రజాపాలన :  రీజినల్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి, తాండూర్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ రెండు ప్రాంతాలలో గల శ్రీ చైతన్య పాఠశాల ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2022 - 23 చివరి పని దినం వరకు మాత్రమే నడపబడును. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2023 - 24 గాను పైన పేర్కొన్న శ్రీ చైతన్య పాఠశాలలు కొనసాగించుటకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా దేవి ఒక ప్రకటనలో తెలియజేశారు.  విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించగలరని ఆమె   తెలియజేశారు.