రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం: జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్

Published: Tuesday April 27, 2021

జిన్నారం, ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రనీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిన్నారం మండల ఎంపిపి రవీందర్ గౌడ్. ఎంపీపీ మాట్లాడుతూ గతంలో బస్తాకు 1కిలో తేసేవరని ఇప్పుడు వడ్లు బస్తాకు 3కిలోలు ఎలా తీసేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో వుండే విధంగా ఈ సంవత్సరం కూడా చేయాలని అన్నారు. అంతేగాని రైతుల వద్ద మూడు కిలోల తీసేసి వాల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రాత్ర పగలనకా కష్టపడి ధాన్యాన్ని పండిస్తే ప్రభుత్వం అధికారులు వాళ్ళ చేతి వాటంతో మూడు కిలోల వడ్లను ఎలా తీసేస్తారు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఇప్పటికైనా అధికారులు రైతులకు మేలు చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకొని బస్తాకి కిలో తీసేయాలని అంతేగాని అధికంగా తీసే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అలాగే కరోనా మహమ్మారి ఉదృతం అవుతున్న సందర్భంలో కరోనా వైరస్ నీ వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఆరోగ్యశ్రీ లో కలిపారు మన తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు. ప్రజలందరూ ప్రతి ఒక్కరు మాస్కులు శానిటైజర్ వాడాలని తమతో పాటు సమాజని ప్రజలని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రకాష్ దుంపల శంకరయ్య భవాని అశోక్ వార్డు సభ్యులు కరుణాకర్ నాయకోటి మురళి తదితరులు పాల్గొన్నారు