సాధన ఫౌండేషన్ మండల సూపర్ వైజర్ గా శ్రీ గద్దె శ్వేత నియామకం

Published: Thursday January 13, 2022

కోరుట్ల, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల సాధన ఫౌండేషన్ సంస్థ మండల సూపర్వైజర్ గా పైడిమడుగు గ్రామానికి చెందిన శ్రీ గద్దె శ్వేత నియమించినట్లు సాధన ఫౌండేషన్ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త నవకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే మిషన్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వాలంటీర్లను నియమించి బడి మానివేసిన మరియు వెనుకబడిన బడి ఈడు పిల్లలు అందరికీ ఉచిత విద్యను అందించడమే సాధన ఫౌండేషన్ యొక్క లక్ష్యమని, కావున ఈ సాధన పౌండేషన్ సంస్థకు రాయికల్ మండల సూపర్  వైజర్ గా శ్వేత ను నియమించడం జరిగిందని జగిత్యాలకో ఆర్డనేటర్ ఎస్.లలిత, సంస్థ చైర్మన్ చెన్నూరి దయాకర్ తెలిపారు.