జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం ** (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ **

Published: Thursday February 23, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 22 (ప్రజాపాలన,ప్రతినిధి) :  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం  ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని టియూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఏఓ లింగమూర్తికు అందజేశారు. అనంతరం రహమాన్ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు జీవనం గడుపుతున్నారని, న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని దాడులను నియంత్రించేందుకు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ 3 లక్షల పథకంలో జర్నలిస్టులకు మొదట ప్రధాన్యత ఇవ్వాలని, టోల్ గేట్ల వద్ద మీడియాకు మినహాయించి ,ఆర్థికంగా వెనుకబడి ఉన్న జర్నలిస్టులకు జర్నలిస్టు బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో  దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా నాయకులు అడప సతీష్, ప్రకాష్ గౌడ్, కృష్ణంరాజు,
బిక్కాజి,రమేష్, వినయ్ కుమార్ ,రాజేంద్రప్రసాద్,  వారణాసి శ్రీనివాస్,సయ్యద్ సోజర్, మేకల శ్రీనివాస్, సురేష్ చారి, శ్రీధర్,ఐల్లయ్య, రాజ్ కుమార్,రమేష్ ,భాస్కర్ చారి, రాజు, తదితరులు పాల్గొన్నారు.