పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలి ......సిపిఎం పార్టీ మండల నాయకులు గజ్జ

Published: Thursday June 16, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 15 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ మండల నాయకులు గజ్జ శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, జనవరి నుండి  ఉపాధి హామీ పనులు చేస్తున్నా కూలీలకు కేంద్ర బిజెపి ప్రభుత్వం డబ్బులు ఇవ్వక పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కూలీల కష్టాలు తీర్చాలని, అలాగే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, మంచి నూనె ధరలు పెంచడం వలన కూలీల మీద మరింత అదనపు భారం పడుతుందని, ఉపాధి చట్టంలో చిన్న మార్పులు కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, రోజుకు 257 రూపాయలు నిర్ణయించిన కొలతల పేరుతో 100 నుండి 150 లోపే వస్తున్నాయని, వచ్చే డబ్బులు కూడా సకాలంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, మాస్టర్ లో ఇంటి పేరు లేకుండా ఇంగ్లీషులో పేర్లు ఇవ్వడంవల్ల ప్రజలు నష్టపోతున్నారని, గ్రూపులుగా కాకుండా జాబ్ కార్డు ప్రకారంగా పని వస్తుంది ప్రతి వారం ఈ గ్రూపులో వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, అలవెన్స్ రద్దు చేశారని, గడ్డపార మొన్న డబ్బులు రావడం లేదని వాటర్ బిల్లులు రావడం లేదనీ మెడికల్ కిట్ అందుబాటులో లేకపోవడంతో గాయాలు అయినా పట్టించుకునే నాథుడు లేడని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని తీసివేసే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందనీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈసమస్యలపై పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.